Sunday, September 6, 2015

ప్రయత్నం

పడిలేచిన కెరటం నేను పైకెగసే వేగం చూడు
నేలక్కొట్టిన బంతిని నేను నేనందుకునే ఎత్తును చూడు
వెనకడుగేసిన సింహం నేను వెయ్యి టన్నుల పంజా చూడు
నిశీధి నిండిన నింగిని నేను నేరుగ వచ్చే భానుని చూడు
వెకిలి చేసిన చేనుని నేను వడ్ల బస్తాల్ నిండాయ్ చూడు.
                                                 
ముళ్ళే లేని మార్గం లేదురా ముందుకు ఉరికే జీవితానికి
కష్టం లేనిదే సుఖం రాదురా కదిలి నడిచే ప్రతీ మనిషికి
ఎగుడు దిగుడులు అడ్డు కావురా ఎదిగే సత్తా ఉన్నవారికి
గెలుపోటములు లెక్కకాదురా గీటురాయి ప్రమాణానికి.

ఆకలి పస్తులు అణచలేవురా అగ్ని నిండిన ఆవేశాన్ని
ఆర్ధిక భారం ఆపలేదురా ఆత్మాభిమానం ఉన్నవాడిని
నల్లేరయినా నడక మానకు పల్లేరయినా పరుగు ఆపకు
ఎదురుదెబ్బలకు బెదిరిపోకు ఒత్తిడి జిత్తులకు లొంగబోకు
మలుపులు తిరిగే మజిలీలెన్నో అసలు మార్గాన్ని మరవబోకు.

ఓటమి ఎదురైతే కృంగిపోకురా మామా
నీ వెన్నంటి మేమున్నాం చూడు మిత్రమా
అనుసరించే అభిమాన లోకం మేము
ఆసరా అందించే ఊత కర్రలం కాగలం
అలసి సొలసి అసువులు బాస్తున్నా

మరో ప్రయత్నం మొదలుపెట్టరా కన్నా.
                   ---ఫకీర్

No comments:

Post a Comment