పొంగే సంద్రం ప్రవహించే రుధిరం
మండే గుండం బండే హృదయం
సాగే పయనం చూసే నయనం
చేసే సమరం రాసే సమయం
ఇది ఒక ఉత్సాహం సమరోత్సాహం
ఇది ఒక ఆవేశం కవితావేశం
కవితంటే,
కన్నీటిని మోసే కావడి
జల ప్రళయపు నీటి ఒరవడి
సునామీ సృష్టించే అలజడి
ఆక్రోశం కట్టలు తెగిపడి
ఉరికెత్తే ప్రస్థానపు సవ్వడి
కవితంటే,
అగ్నిపర్వతపు ఎర్రటి ధూమం
ఆకసమునంటే కల్లోల క్రోధం
మంచిని కోరే జ్వాలా హోమం
నిప్పులు చెరిగే మహాద్యుతికరం
అభ్యుదయపు ఆకలి జఠిరం
సంధించే వరశర నిప్పుల వర్షం
వెలుగుతూ కరిగే శ్మశాన కర్పూరం
కవితంటే,
నీలి ఛాయపు వినీలాకాశము
ఘీంకరిస్తూ గర్జించే ఉరుము
విజయ దరహాసపు ప్రచండ సింహనాదము
పెళపెళ మిన్నులు విరిగే వింత చప్పుడు
నరసురాసుర యుద్ధోన్మాదపు శంఖారావం
మార్పుకోసం పూరించిన ధనుష్ఠంకారం
అస్త్రం సంధించిన ఫల్గుణ గాంఢీవం
కవితంటే,
రివ్వున వీచే మలయమారుతం
పెక్కుటిల్లిన పర్వత శిఖరం
తుఫాను గాలికి అతలాకుతలం
ధాటికి ఆగని ధరణీవాసం
పెకలించి వేసిన గాలి దుమారం
మోడై మిగిలిన మహా వృక్షము
ఎక్కడికక్కడ విలయ తాండవం
వినాశమొందిన మరణ మృదంగం
కవితంటే,
భూకంపపు ప్రకంపనలు
పాపం పండిన ప్రేలాపనలు
బీటలు వారిన నాగలి గుర్తులు
నెర్ర్ఎలిచ్చిన పర్వత శ్రేణులు
ఎక్కడ చూసిన జీవచ్ఛవాలు
ప్రకోపించిన ప్రకృతి రూపం
రూపం దాల్చిన అభ్యుదయం
పంచభూతములు సప్తహాయములు
ఈ క్షణమున ఏకమై మహోద్రేకమై
నాలో నిక్షిప్తమై ప్రేరేపణలై
ఝరులై పారి నా కలమున జారి
భవితై కవితై ఆవిర్భవించెను
ఇదిగిదిగో ఈ క్షణమునే
రెండుగా చీలిన భూమి
ఉవ్వెత్తున లేచిన నిప్పు
ప్రచండనాదం చేసిన ఆకాశం
మహోగ్రతేజమున గాలి
వరమై వర్షించిన నీరు
ఒక్కసారిగా దిక్కులన్నింటిని
బంధించేస్తూ నినదించాయి
కలం జారిన కవితను నిర్వచించాయి.
---ఫకీర్
మండే గుండం బండే హృదయం
సాగే పయనం చూసే నయనం
చేసే సమరం రాసే సమయం
ఇది ఒక ఉత్సాహం సమరోత్సాహం
ఇది ఒక ఆవేశం కవితావేశం
కవితంటే,
కన్నీటిని మోసే కావడి
జల ప్రళయపు నీటి ఒరవడి
సునామీ సృష్టించే అలజడి
ఆక్రోశం కట్టలు తెగిపడి
ఉరికెత్తే ప్రస్థానపు సవ్వడి
కవితంటే,
అగ్నిపర్వతపు ఎర్రటి ధూమం
ఆకసమునంటే కల్లోల క్రోధం
మంచిని కోరే జ్వాలా హోమం
నిప్పులు చెరిగే మహాద్యుతికరం
అభ్యుదయపు ఆకలి జఠిరం
సంధించే వరశర నిప్పుల వర్షం
వెలుగుతూ కరిగే శ్మశాన కర్పూరం
కవితంటే,
నీలి ఛాయపు వినీలాకాశము
ఘీంకరిస్తూ గర్జించే ఉరుము
విజయ దరహాసపు ప్రచండ సింహనాదము
పెళపెళ మిన్నులు విరిగే వింత చప్పుడు
నరసురాసుర యుద్ధోన్మాదపు శంఖారావం
మార్పుకోసం పూరించిన ధనుష్ఠంకారం
అస్త్రం సంధించిన ఫల్గుణ గాంఢీవం
కవితంటే,
రివ్వున వీచే మలయమారుతం
పెక్కుటిల్లిన పర్వత శిఖరం
తుఫాను గాలికి అతలాకుతలం
ధాటికి ఆగని ధరణీవాసం
పెకలించి వేసిన గాలి దుమారం
మోడై మిగిలిన మహా వృక్షము
ఎక్కడికక్కడ విలయ తాండవం
వినాశమొందిన మరణ మృదంగం
కవితంటే,
భూకంపపు ప్రకంపనలు
పాపం పండిన ప్రేలాపనలు
బీటలు వారిన నాగలి గుర్తులు
నెర్ర్ఎలిచ్చిన పర్వత శ్రేణులు
ఎక్కడ చూసిన జీవచ్ఛవాలు
ప్రకోపించిన ప్రకృతి రూపం
రూపం దాల్చిన అభ్యుదయం
పంచభూతములు సప్తహాయములు
ఈ క్షణమున ఏకమై మహోద్రేకమై
నాలో నిక్షిప్తమై ప్రేరేపణలై
ఝరులై పారి నా కలమున జారి
భవితై కవితై ఆవిర్భవించెను
ఇదిగిదిగో ఈ క్షణమునే
రెండుగా చీలిన భూమి
ఉవ్వెత్తున లేచిన నిప్పు
ప్రచండనాదం చేసిన ఆకాశం
మహోగ్రతేజమున గాలి
వరమై వర్షించిన నీరు
ఒక్కసారిగా దిక్కులన్నింటిని
బంధించేస్తూ నినదించాయి
కలం జారిన కవితను నిర్వచించాయి.
---ఫకీర్