వెలకట్టలేని విలువైన బంధమా
వినువీధుల వెంట నడిపిన చందమా
వెన్నెల్లో నన్ను కలసిన కలవరమా
వన్నె తగ్గని మిన్ను మెరుపుల అందమా
వన ప్రసాదిత వసంతపు ఆనందమా
వెర్రిబాగులోడ్ని చేస్తివా నన్ను ఓ స్నేహమా!
నువ్వు కావాలని అడగలేదు ఆ దేవుడ్ని నేను
నన్ను నేను చూసుకోటానికి సృష్టించాడు నిన్ను
నరక కూపమే నీవు లేకపోతే ఎప్పటికీ నేను
నువ్వులేని నన్ను నేనూహించలేను
నన్నల్లుకు పోయిన తీగవని చూస్తుంటే నిన్ను
వెర్రిబాగులోడ్ని చేస్తివా ఓ స్నేహమా నన్ను
అద్వైతమో ద్వైతమో ఈ మొత్తం ఒకటే కదా
అందరూ కావాలంటూ నన్ను వేరు చేస్తుందీ వ్యథ
అదెందుకు నువ్వు నేను అని వేరు చేస్తే
ఈ బాధ
అంతరంగంలో ఆత్మారాముడు అందరికీ ఒకటే కదా
అందరం ఒకటైనప్పుడు ఇక ఎందుకీ కథ
ఓ స్నేహమా! నిజంగానే నేను వెర్రిబాగులోడ్ని
కదా!!!
---ఫకీర్