కన్ను తెరవని చిన్ని ప్రాణం
నాన్న కోసం తల్లడిల్లే
అతన్నేమో శత్రువంటూ
గన్నుతో బలిగొంటివన్నా!
పేద ఇంటను పుట్టెనొక్కడు
బాధలెన్నో ఓర్చి చదివి
క్షుదను తీర్చే కొలువు చేరితె
మందుపాతర మింగెనన్నా!
అడవి పుట్టిన చెట్టు ఒక్కటి
నడక నేర్చితె నగరు చేరితె
పుడమి ద్రోహం కూర్చెననుకొని
కడకు వాడిని నరికేస్తివన్నా!
పేదవాడిని గిరిజనోడిని
కాల్చివేసే పేల్చివేసే
విప్లవం అది ఎందుకన్నా?
అన్నవైతివి ఎవరికన్నా?
---ఫకీర్