జీవితమనే రహదారిలో పయనించు నిత్య బాటసారిని నేను
జీవిత లక్ష్యాన్ని ఛేదించు క్రమానివి నీవు
అలుపెరుగని ప్రయత్నం నాది
గెలుపుపై ధీమా నీది
వెను తిరిగి చూడని ధీరుడను నేను
వెన్ను చూపని శూరుడివి నీవు
నిన్ను పట్టించుకోని వైనం నాది
నన్ను పట్టుకుని ఉండే గుణం నీది
అందమైన రంగు పుష్పాన్ని నేను
అందులోని తీపి పుప్పొడి నీవు
నీకై వేచి చూచెడి కమల స్వభావం నాది
నాకై ఉదయించాలనే సూర్యుని భావం నీది
నా పేరు మనసు నీ పేరు ఆత్మ
మనల్ని సమన్వయించే వాడు మహాత్మ.
---ఫకీర్
జీవిత లక్ష్యాన్ని ఛేదించు క్రమానివి నీవు
అలుపెరుగని ప్రయత్నం నాది
గెలుపుపై ధీమా నీది
వెను తిరిగి చూడని ధీరుడను నేను
వెన్ను చూపని శూరుడివి నీవు
నిన్ను పట్టించుకోని వైనం నాది
నన్ను పట్టుకుని ఉండే గుణం నీది
అందమైన రంగు పుష్పాన్ని నేను
అందులోని తీపి పుప్పొడి నీవు
నీకై వేచి చూచెడి కమల స్వభావం నాది
నాకై ఉదయించాలనే సూర్యుని భావం నీది
నా పేరు మనసు నీ పేరు ఆత్మ
మనల్ని సమన్వయించే వాడు మహాత్మ.
---ఫకీర్
No comments:
Post a Comment